ఏకంగా ముఖ్యమంత్రి ఇంటినే చుట్టుముట్టారు
జార్ఖండ్ లోని రాంచి నగరంలో బీజేపీ యువ మోర్చా నేతలు నిరుద్యోగభృతి కోసం భారీ ర్యాలీ చేపట్టారు. దీంతో అక్కడ హింసాత్మక సంఘటనలు జరిగాయి. నిరసన కారులపైకి వాటర్ కెనాన్స్ ప్రయోగించారు పోలీసులు. ఎన్నికల్లో హామీలు ఇవ్వడం ఆ తర్వాత మర్చిపోవడం జేఎంఎంకు అలవాటుగా మారిందంటూ కార్యకర్తలు మండిపడ్డారు. ఇప్పటికైనా నిరుద్యోగభృతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.