ఢిల్లీ ప్రజలకు బీజేపీ గుడ్ న్యూస్… మున్సిపల్ ఎన్నికల వేళ బంపర్ ఆఫర్
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు ముందు మాస్టర్ ప్లాన్ 2041 ప్రకారం ప్లాట్లో మరింత ఎక్కువ నిర్మాణాలకు ప్రజలను అనుమతిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఫ్లోర్ ఏరియా రేషియో దాదాపు రెట్టింపు అవుతుందని పేర్కొంది. దేశ రాజధానిలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడంలో ఈ నిర్ణయం సహాయపడుతుందని కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రజల జీవన స్థితిని మెరుగ్గా, సురక్షితంగా ఉంచడానికి ఫ్లోర్ ఏరియా రేషియో FAR సదుపాయంతో వారి పాత శిధిలమైన ఇళ్లను తిరిగి కట్టుకోడానికి లేదా పునర్నిర్మించడానికి సహకరిస్తోందని బీజేపీ పేర్కొంది. FAR, గత ఆరు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. 1962 ప్రణాళికలో 133, మాస్టర్ ప్లాన్ 2001 కింద 1981 సంవత్సరంలో 167కి పెరిగిందన్నారు. గత సంవత్సరం అది 200కి చేరుకుందని… మాస్టర్ ప్లాన్ 2041లో అది మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. FAR – కూల్చివేసేందుకు, పునర్నిర్మించడానికి కూడా వర్తిస్తుందని చెప్పారు. తాజాగా ఆ పరిమాణం 260 నుండి 340 వరకు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. DDA కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే విభాగాలలో ఒకటి, అయితే ఢిల్లీ ప్రభుత్వం చాలా ఇతర విభాగాలను నిర్వహిస్తుంది. దీంతో కేంద్రంలోని అధికార బీజేపీకి, ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వానికి మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

వీధి స్థాయిలో పారిశుధ్య సేవలను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. అనేక ఇతర సేవలను అందిస్తుంది. బీజేపీ తన మూడు ప్రాంతాల వారీగా కార్పొరేషన్లను తిరిగి ఒకటిగా చేసింది. డిసెంబర్ 4న ఓటింగ్ జరగనుండగా… 7న ఫలితాలు వెలువడతాయి. ప్రచారంలో భాగంగా DDA పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి బీజేపీ వ్యూహరచన చేస్తోంది. 1,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఢిల్లీ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 1.6 కోట్ల మందిని కలిగి ఉందని, ఇది 2041 నాటికి 3 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని నొక్కి ఉందన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) మార్గదర్శకాల ప్రకారం జుగ్గీ (మురికివాడల) నివాసితుల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని… ప్రజలు 675 క్లస్టర్లలో నివసించేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. 376 క్లస్టర్లు (1.72 లక్షల కుటుంబాలు) డీడీఏ, కేంద్ర ప్రభుత్వ భూమిలో ఉన్నాయని, 210 క్లస్టర్లలో పునరావాస ఫ్లాట్ల కేటాయింపు కోసం సర్వే చేశామన్నారు. మిగిలిన 166 సర్వే పనులు మునిసిపల్ ఎన్నికల తర్వాత వెంటనే ప్రారంభమవుతాయని, మార్చి 2023 నాటికి పూర్తి చేస్తామని మంత్రి పూరి హామీ ఇచ్చారు. ఇటీవల కల్కాజీలో 3,024 ఫ్లాట్లను కేటాయించామన్నారు. AAPని లక్ష్యంగా చేసుకుని, పునరావాస బాధ్యత ఢిల్లీ ప్రభుత్వంపై ఉన్నా… 299 స్లమ్ క్లస్టర్లలో, “దురదృష్టవశాత్తూ, ఈ రోజు వరకు ఎటువంటి పని జరగలేదన్నారు. AAP తన ప్రచారాన్ని పారిశుధ్య సమస్య చుట్టూ కేంద్రీకరించింది… నగరం అంతటా చెత్త గుట్టల్లా పేరుకుపోడానికి, కారణం బీజేపీ అంటూ విమర్శలు గుప్పిస్తోంది.

