Home Page SliderNationalPoliticsTrending Today

మహారాష్ట్రలో బీజేపీ అత్యుత్తమ ప్రదర్శన..సీఎం పీఠం ఎవరిది?

బీజేపీ పార్టీ మహారాష్ట్ర ఎన్నికలలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది. ఈ ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ చరిత్రలోనే మహారాష్ట్రలో అధిక స్థానాలు సాధించింది. అయితే మహాయుతి కూటమిలో ప్రస్తుత ముఖ్యమంత్రి షిండే కొనసాగుతారా?.. లేదా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పఢ్నవీస్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే బీజేపీ వర్గాలలో దేవేంద్ర పఢ్నవీస్‌ను సీఎం పదవికి నామినేట్ చేయాలనే డిమాండ్ బీజేపీ వర్గాల నుండి వస్తోంది. కూటమి పార్టీలను అధిగమించి 90 శాతం స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన స్థానాలలో గెలుపొందిన బీజేపీకి దాదాపు ఒంటరిగానే స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ జాతీయ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ ముఖ్యనేతలందరూ కూడా హాజరయ్యారు.  మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం. ఒకవేళ బీజేపీ నేత దేవేంద్రపఢ్నవీస్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే జాతీయస్థాయిలో ఉత్తమపదవి లేదా, కేంద్రమంత్రి పదవి అయినా ఇస్తారని మీడియా వర్గాలు చెప్తున్నాయి.