హర్యానా ఎన్నికల్లో 25 లక్షల ఫేక్ ఓట్లు వేసి బీజేపీ గెలిచింది..
న్యూఢిల్లీ: 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ స్థాయిలో నకిలీ ఓట్లతో గెలిచిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘాటుగా ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, సుమారు 25 లక్షల ఫేక్ ఓట్లు వేసి బీజేపీ విజయాన్ని సాధించిందని , హర్యానాలో ప్రతి ఎనిమిది ఓటర్లలో ఒకరు నకిలీ ఓటరు అని తెలిపారు. రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో ఫేక్ ఓటర్లకు సంబంధించిన ఫోటోలు, ఆధారాలను ప్రదర్శించారు. “ఓటర్ల జాబితాలో విదేశీ మోడల్ పేరు కూడా ఉంది. ఆ మోడల్ పేరు రాయ్‌లోని ఒక పోలింగ్ బూత్‌లో 22 సార్లు ఓటు వేసినట్లు రికార్డులు చూపుతున్నాయి,” అని సంచలనంగా వెల్లడించారు. అదే విధంగా, ఒక మహిళ పేరు 223 సార్లు ఓటర్ల జాబితాలో నమోదు అయినట్లు మరో ఉదాహరణగా చెప్పారు. అంతేకాక, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేతలు హర్యానాలో ఓటు వేశారని ఆధారాలతో రాహుల్ గాంధీ ఆరోపించారు. “ఎన్నికల సంఘం ఈ డూప్లికేట్ ఓట్లను ఎందుకు తొలగించడం లేదు.? ఎందుకంటే అదే బీజేపీ విజయానికి కారణం” అని విమర్శించారు.

