అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 61 సీట్లు-ఈటల
కేసీఆర్ తనకు ఎదురులేదు అనుకున్నారని, ఈ రాష్ట్రానికి నేనే ఓనర్ అన్నట్టు వ్యవహరించారని విమర్శించారు బీజేపీ ముఖ్య నేత ఈటల రాజేందర్. ఈ విషయాన్ని ఇప్పటికైనా కేసీఆర్ అర్థం చేసుకోవాలన్నారు. మాటలకి, చేతలకి పొంతన లేని నాడు తెలంగాణ ప్రజలు బండకేసి కొడతారు అని గుర్తు చేస్తున్నానన్నారు. తెలంగాణ వారు అమాయకంగా కనిపిస్తారు, కానీ హింస పెడితే, దబాయింపుకి దిగితే మౌనంగా భరిచడం అలవాటు చేసుకున్నారని, కానీ సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు అనేది మర్చిపోయాడని ఈటల దుయ్యబట్టారు. TUWJ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

BRS ఉన్నతకాలం KCR కుటుంబమే ముఖ్యమంత్రి పదవి చేపడతుందని, కాంగ్రెస్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖ్యమంత్రి కాలేడని, కానీ బీజేపీ బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తోందన్నారు ఈటల రాజేందర్. ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన నాయకులు పార్టీలు మారడం వారి రాజకీయ భవిష్యత్తు కోసమేనని విమర్శించారు. జనసేన పొత్తు అవసరం అని పార్టీకి అనిపించింది పెట్టుకుందన్నారు. మాకు బలం లేని దగ్గర వారికి సీట్లు ఇస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 61 స్థానాలొస్తాయని ఈటల జోస్యం చెప్పారు.


 
							 
							