Home Page SliderNational

మిల్కిపూర్ లో బీజేపీ, ఈరోడ్ ఈస్ట్ లో డీఎంకే విజయం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు యూపీలోని మిల్కిపూర్, తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గాల్లోనూ ఉపఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య జిల్లా మిల్కిపూర్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి చంద్రభాను పాశ్వాన్ ఎస్పీ అభ్యర్థి అజిత్ ప్రసాద్ పై 70 వేల ఓట్లకు పైగా మెజార్టీతో భారీ విజయం సాధించారు. ఇక తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్ సెగ్మెంట్ లో ఆ రాష్ట్రంలో అధికార పార్టీ డీఎంకే విజయం సాధించింది. డీఎంకే అభ్యర్థి వీసీ చాంధిరా కుమార్ ఎన్ఎంకే అభ్యర్థి ఎంకే సీతామహా లక్ష్మిపై దాదాపు 55 వేల మెజార్టీతో గెలిచారు.