100 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేయనున్న బీజేపీ
బీజేపీ అర్ధరాత్రి సమావేశం తర్వాత కీలక నిర్ణయం
100 మంది పేర్లతో కూడిన తొలి జాబితాను విడుదల
మార్చి 10కి 50% అభ్యర్థులను ప్రకటించే యోచన
2019లోనూ ఇదే విధంగా పార్టీ నిర్ణయం
షెడ్యూల్ ప్రకటనకు ముందు అభ్యర్థుల వెల్లడి
2019 మార్చి 21న 164 మంది జాబితా విడుదల
2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి ప్రముఖులతో సహా దాదాపు 100 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేస్తుందని భావిస్తున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో జరిగిన మారథాన్ రాత్రి సమావేశాల తర్వాత పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో గురువారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైన సమావేశం, శుక్రవారం తెల్లవారుజామున 3.15 గంటలకు ముగిసింది. మూడోసారి అధికారం కోసం బీజేపీ ఈసారి కొత్త వ్యూహాలు రచిస్తోంది. సిట్టింగ్ ఎంపీల అభిప్రాయాన్ని తీసుకోవడంతోపాటు, అట్టడుగు స్థాయి కార్యకర్తలు, వారి నియోజకవర్గాల్లోని ఓటర్ల అభిప్రాయాలను సైతం క్రోడీకరించిన తర్వాత… అభ్యర్థుల ఖరారుపై బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్‌పై ఒత్తిడి పెంచేందుకు ఎన్నికల తేదీలు ప్రకటించే ముందు, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మిత్రపక్షాల అభ్యర్థులతో సహా అభ్యర్థుల సంఖ్యను ప్రకటించాలని పార్టీ భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

హిందీ హార్ట్‌ల్యాండ్, సౌత్ మీద బీజేపీ ఫోకస్
హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాలైన యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, అలాగే ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ అభ్యర్థులపై దృష్టి సారించింది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళపైనా పార్టీ ఫోకస్ పెట్టింది. సాంప్రదాయంగా బీజేపీ ఉనికి కేరళలో లేదు. తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. అర్ధరాత్రి సమావేశం తర్వాత బీజేపీ 100 మంది పేర్లతో కూడిన తొలి జాబితాను విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడుతో సహా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నిర్ణయం ప్రాంతీయ పార్టీలతో పొత్తు చర్చలు పెండింగ్‌లో ఉన్నాయి. తరువాతి రెండు రాష్ట్రాల్లో అకాలీదళ్, అన్నాడీఎంకేతో తిరిగి సంబంధాలను నెలకొల్పాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ-జనసేన కూటమిలో ఎవరిని ఎంచుకుంటుందన్నదానిపై క్లారిటీ రావాలి.

తొలి జాబితాలో ప్రధాని మోదీ, అమిత్ షా?
1991 నుండి బిజెపికి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో (2004లో కాంగ్రెస్ గెలిచింది) తన స్థానంలో మరోసారి మోదీ పోటీ చేయబోతున్నారు. 2014, 2019లో ఇక్కడ మోదీ అద్భుత విజయాలు సాధించారు. మొదటి ఎన్నికల్లో 3.7 లక్షల ఓట్లతో, రెండో ఎన్నికల్లో దాదాపు 4.8 లక్షల ఓట్లతో గెలుపొందారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఈసారి ప్రధాని నరేంద్రమోదీని ఢీకొట్టేందుకు రంగంలోకి దిగబోతున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీతో తలపడతానంటూ బీహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడినా, ఆయన ఇటీవల తిరిగి బీజేపీతో కలిసిపోవడంతో ప్రియాంక, మోదీపై పోటికి దిగడం ఖాయమనుకోవాలి. 2019 నుంచి ప్రియాంక గాంధీ పోటీపై చర్చ సాగుతోంది. సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికకావడంతో.. ఆమె ఖాళీ చేసిన రాయ్‌బరేలీ నుండి ప్రియాంక పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది.

మరోవైపు అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి బరిలోకి దిగవచ్చు. LK అద్వానీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి దిగ్గజాలను లోక్‌సభకు పంపిన ఈ స్థానాన్ని 1989 నుండి BJP కైవసం చేసుకుంటుంది. షా 2019లో ఈ సీటును గెలుచుకున్నారు. కాంగ్రెస్ నేత చతురైన్ చావ్దాను ఓడించి 5.5 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మధ్యప్రదేశ్‌లోని లక్నో, గుణ-శివపురి నుండి వరుసగా పోటీ చేయవచ్చు. గాంధీనగర్ మాదిరిగానే యూపీ రాజధాని కూడా బీజేపీకి కంచుకోట. వాజ్‌పేయి 1991 నుండి 2004 వరకు ఇక్కడ్నుంచి పోటీ చేశారు. రాజ్‌నాథ్ సింగ్ 2014 నుండి కాంగ్రెస్‌కు చెందిన రీటా బహుగణ జోషి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన పూనమ్ సిన్హాలపై గెలిచారు. సింధియాకు మధ్యప్రదేశ్‌లో సీటు రావడం ఖాయం. గుణ-శివపురి సింధియా ఫ్యామిలీ కంచుకోట. 1952లో జరిగిన తొలి ఎన్నికల నుంచి సింధియా రాజకుటుంబం ఈ స్థానాన్ని 14 సార్లు గెలుచుకుంది. జ్యోతిరాదిత్య సింధియా 2002… తన తండ్రి మాధవరావు సింధియా మరణంతో ఉప ఎన్నికలో గెలిచారు. 2014లోనూ ఎంపీగా విజయం సాధించారు. అయితే సింధియా బీజేపీలోకి మారాక… రాజ్యసభ స్థానానికి నామినేట్ అయ్యాడు. 2019లో బీజేపీకి చెందిన కృష్ణ పాల్ యాదవ్ ఈ స్థానాన్ని గెలుచుకున్నారు.

మొదటి జాబితాలో అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ పేరు ఉండొచ్చు. 2004లో అసోం గణ పరిషత్‌లో ఉన్నప్పుడు… అసోంలోని డిబ్రూఘర్ నుండి గెలిచారు. అసోంలో బిజెపి 11 స్థానాల్లో పోటీ చేస్తుందని, దాని మిత్రపక్షాలైన అసోమ్ గణ పరిషత్… యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్‌లకు మూడు వదిలివేస్తుందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్ సభ బరిలో దిగబోతున్నారు. భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌కు ఈసారి అవకాశం లేకపోవచ్చని తెలుస్తోంది. చౌహాన్ – గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత ముఖ్యమంత్రిగా తప్పించారు. సంక్షేమ చర్యలు, ముఖ్యంగా ‘లాడ్లీ బెహనా’ పథకం, పార్టీకి, రాష్ట్రంలో పట్టు నిలబెట్టింది. సొంత జిల్లా విదిషా నుండి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చౌహాన్ 1991 నుండి 2004 వరకు ఈ స్థానం నుండి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. విదిషా బీజేపీ బిజెపి కోటగా ఉంది. కాషాయ పార్టీ 1989 నుండి విదిషలో విజయం సాధిస్తూ వస్తోంది. దేశంలోని అత్యధిక మందిని లోక్ సభకు పంపించే యూపీలోని 80 స్థానాల్లో 6 సీట్లను మిత్రులకు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. అప్నా దళ్, జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్ దళ్ వంటి ప్రాంతీయ మిత్రపక్షాల కోసం వదిలియాలని భావిస్తోంది. మార్చి 10 నాటికి కనీసం 50 శాతం అభ్యర్థుల పేర్లను ప్రకటించాలనేది బీజేపీ ప్రణాళిక. 2019లోనూ పార్టీ అదే విధంగా వ్యవహరించింది. మార్చి 21న 164 మంది అభ్యర్థులను నాడు వెల్లడించింది.

