మునుగోడులో ప్రచారం ముమ్మరం చేయనున్న బీజేపీ
మునుగోడు ఉపఎన్నికలను తెలంగాణాలోని అధికార,ప్రతిపక్ష పార్టీలు ఓ మహాయజ్ఞంలా భావిస్తున్నాయి. ఇందు కోసం మునుగోడు నియోజకవర్గంలో అధికార,ప్రతిపక్ష పార్టీల ప్రచారం జోరందుకొంది. మునుగోడులో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతిగ్రామంలోనూ ప్రచారం చేసేందుకు ప్రచార షెడ్యూల్‌ను బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మెన్ వివేక్, మనోహర్ రెడ్డి తయారు చేశారు. దీని ప్రకారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. ఈ నెల 18 వరకు తెలంగాణా బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు నిర్వహిస్తారు. 25 నుంచి బీజేపీ జాతీయ స్థాయి నేతలు ఈ ప్రచారంలో పాల్గొంటారు. మునుగోడు ఉపఎన్నికలో గెలిచి సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. 2023లో జరగనున్న తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే మునుగోడు తప్పనిసరి అని ఆ పార్టీ భావిస్తోంది. కేంద్ర మంత్రులు, సీనియర్నేలు చలో మునుగోడు అంటూ హోరెత్తిస్తున్నారు.

