Home Page SliderTelangana

ప్రజాస్వామ్యం గెలవాలని బీజేపీ కోరుకుంటోంది: జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలు ఓడిపోయి ప్రజలు, ప్రజాస్వామ్యం గెలవాలని బీజేపీ కోరుకుంటోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవహేళన చేసే పార్టీకి, సామాజిక తెలంగాణకు అడ్డుగా ఉన్న మరో పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ, భావితరాల భవిష్యత్తు కోసం ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా బీజేపీకి ఓటేయాలని కోరారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ నేతృత్వంలోనే తెలంగాణ భద్రంగా ఉంటుందన్నారు. మరోసారి రాష్ట్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లకూడదన్నారు. ప్రచారం ఆరంభం నుండి రోజురోజుకూ బీజేపీకి ఆదరణ పెరుగుతోందన్నారు. ఓటర్లు దయచేసి బీజేపీ కమలం పువ్వు గుర్తుపై ఓటేసి పార్టీని గెలిపించవలసిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.