ఏప్రిల్ 6న ప్రతి పోలింగ్ బూత్‌లో బీజేపీ టిఫిన్ బైఠక్: కిషన్‌రెడ్డి
ఏప్రిల్ 6న ప్రతి పోలింగ్ బూత్‌లో బీజేపీ టిఫిన్ బైఠక్ నిర్వహించాలని కేంద్ర మంత్రి, టి.బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో ఆదివారం బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, బూత్ కమిటీల బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నేతలు, కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లాలని. తెలంగాణలో కచ్చితంగా బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తుందని అన్నారు.

