నేడు బీజేపీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరగనుంది. శంషాబాద్ మల్లిక కన్వెన్షన్ హాలులో జరగనున్న ఈ భేటీకి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కానున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జులు సునీల్, తరుణ్ ఛుగ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పదాధికారులు, కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

