మిజోరాం బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల దేశంలోని 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాజస్థాన్, తెలంగాణా, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల్లోని పార్టీలన్ని అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ మిజోరాం బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాగా 12 మందితో తొలి జాబితాను బీజేపీ తాజాగా విడుదల చేసింది. కాగా మిగిలిన చోట్ల అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని బీజేపీ వెల్లడించింది. మరోవైపు తెలంగాణాలో కూడా బీజేపీ రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.