Home Page SliderTelangana

రేపు హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు

బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. కాగా రేపు హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించబోయే సంపర్క్ సే సంవర్ధన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన రేపు మధ్యహ్నం 12:30 గంటలకు శంషాబాద్‌కు చేరుకోనున్నారు. ఈ క్రమంలోనే జేపీ నడ్డా తెలంగాణాలోని పలువురు ప్రముఖులతో భేటి కానున్నట్లు సమాచారం. అనంతరం సాయంత్రం నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగించనున్నారని బీజేపీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.