Home Page SliderNational

రాహుల్ గాంధీ ఇంటికి బీజేపీ ఎంపీ..

నేడు దేశ రాజధాని ఢిల్లీలో అన్యూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ పార్టీకి చెందిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు. తన వెంట బ్లిట్జ్ మేగజైన్ కాపీలను తీసుకెళ్లారు. తొలుత గేట్ వద్ద ఆయనను భద్రత సిబ్బంది ప్రశ్నించారు. వచ్చిన కారణాలను అడిగి తెలుసుకున్న తరువాత లోపలికి పంపించారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశంలో ఉన్నారు. రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడం వల్ల బ్లిట్జ్ మేగజైన్ కాపీలు అక్కడి రిసెప్షన్ సిబ్బందికి అప్పగించి బయటికొచ్చారు.

అసలు ఏం జరిగిందంటే..
రాహుల్ బేకన్, బీఫ్ అంటే చాలా ఇష్టమని, ఆయన ఆహార, జీవన శైలి పూర్తిగా హిందూ మతానికి భిన్నమైనదంటూ బ్లిట్జ్ మేగజైన్ కొద్దిరోజుల కిందటే ప్రచురించింది. రాహుల్ హిందూ కుటుంబానికి చెందినవాడని తాము భావించలేదంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రఘునందన్ రావు… నేరుగా రాహుల్ ఇంటికి వెళ్లారు. ఇందులో వచ్చిన కథనాలకు ఏ సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎవరూ దీని గురించి మాట్లాడలేదని, అందుకే తాను నేరుగా రాహుల్ ను కలిసి వివరణ తీసుకోవడానికి వచ్చానని చెప్పారు. రాహుల్ పెళ్లిపై వచ్చిన ఈ కథనాలపై ఏం చర్య తీసుకుంటారో ఎదురు చూస్తున్నానని రఘునందన్ రావు మీడియాతో తెలిపారు. రాహుల్ గాంధీకి పెళ్లై పిల్లలు ఉన్నట్లు బంగ్లాదేశ్ కు చెందిన బ్లిట్జ్ పత్రిక కథనాలు ప్రచురించిందని, ఆ పత్రికకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.