INDIA కూటమికి తెలివి లేదన్న బీజేపీ ఎంపీ
దేశంలోని విపక్షాల కూటమి INDIAపై బీజేపీ ఎంపీ రవికిషన్ విమర్శలు గుప్పించారు. కాగా విపక్షాల కూటమి INDIA ప్రతినిధులు రేపు,ఎల్లుండి మణిపూర్ పర్యటన చేయనున్నట్లు ప్రకటించారు. దీనిని ఉద్ధేశించి బీజేపీ ఎంపీ రవికిషన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..వాళ్లకు దిశానిర్దేశం లేదని..పాకిస్తాన్,శ్రీలంక,చైనా వెళ్లాలని దుయ్యబట్టారు. కాగా పార్లమెంటు సమావేశాల్లో కూడా మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మణిపూర్ హింసలో ఇప్పటికే 100మందికి పైగా పౌరులు మరణించినట్లు తెలుస్తోంది.

