నేడు కొత్త స్పీకర్ ఎదుట ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు
ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఎదుట ప్రమాణం చేయబోమంటూ భీష్మించుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు నేడు తెలంగాణ శాసన సభలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ కొత్త అసెంబ్లీ నేడు కొలువు తీరింది. అసెంబ్లీ స్పీకరుగా గడ్డం ప్రసాద్ కుమార్ తొలుత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయనను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు స్పీకర్ స్థానంలో కూర్చొబెట్టారు. ఎమ్మెల్యేలుగా మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేయని ఎమ్మెల్యేలు నేడు ఆయన ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో తెలంగాణ ఉద్యమ కాలంలో పని చేశామని మాజీ తెలంగాణ మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ ఆపరేషన్ సందర్భంగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. నేడు కేటీఆర్ కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త శాసన సభకు ఎంపికైన బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్ సహా నేడు గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

