దేవాలయ పూజా హారతిలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కార్తీకమాసం ఏకాదశిని పురస్కరించుకుని గురువారం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి పూజా హారతిలో పాల్గొన్నారు. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు చాలా గొప్పవని, ఈ తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. మఠాధిపతి యోగానంద సరస్వతి ఆయనకు ఆశీర్వచనాలు అందించారు.