బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్
తెలంగాణ అసెంబ్లీ ముందు బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని ఆపాలంటూ డిమాండ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే యేలేటి మహేశ్వర్ రెడ్డి నేటి ఉదయం బీజేవైఎం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కారణంగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చారు. ఆయనను రోడ్డు మీద తిప్పారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనలు చేపట్టారు. అసెంబ్లీ గన్‌పార్క్ ముందు నిరసన తెలుపుతున్నారు. ఉస్మానియా ప్రభుత్వ భూములు అమ్మోద్దంటు నిరసన తెలిపిన బీజేవైఎమ్ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు చేశారు. నిరసనను అడ్డుకుని వారిని పోలీస్ వాహనం ఎక్కించారు పోలీస్ సిబ్బంది.


 
							 
							