బీజేపీ గెలిచే సీట్లు ఇవే..! 9 స్థానాల్లో కమలం ఆధిక్యం
తెలంగాణలో బీజేపీ అద్భుతపనితీరు కన్పిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న ఆ పార్టీ ఇప్పుడు 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో మూడు స్థానాల్లో పార్టీ అభ్యర్థులు లీడ్ పొజిషన్లో ఉన్నారు. సిర్పూర్, ఆదిలాబాద్, నిర్మల్, మూధోల్ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉండగా, నిజమాబాద్ జిల్లాలో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక హైదరాబాద్ లో మూడు స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. కార్వాన్, గోషామహల్, యాకుత్ పురాలో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
