Home Page SliderNational

మూడు రాష్ట్రాలలో బీజేపీ హవా…

నేడు జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల లెక్కింపులో తెలంగాణలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. కాగా మిగిలిన మూడు రాష్ట్రాలలో బీజేపీ విజయ కేతనం ఎగురవేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీ పార్టీ విజయం సాధించింది. రాజస్థాన్‌లో బీజేపీ అభ్యర్థి దియా కుమారి విద్యాధర్ నగర్ నుండి విజయం సాధించగా, ఆమె సీఎం రేసులో ఉన్నట్లు సమాచారం.  రాజస్థాన్‌లో  బీజేపీ 115 సీట్లు సాధించగా, కాంగ్రెస్ 71 సీట్లు సాధించింది.   చత్తీస్ గఢ్‌లో బీజేపీ 56 స్థానాలలో గెలుపొందగా, కాంగ్రెస్ 34 స్థానాలలో ముందంజలో ఉంది. ఇతరులు 13 స్థానాలలో గెలుపొందారు. ఇక మధ్యప్రదేశ్‌లో బీజేపీ 165 సీట్లు సాధించగా, కాంగ్రెస్ 64 సీట్లు సాధించింది. ఇతరులు ఒకస్థానంలో గెలుపొందారు.