Home Page SliderNational

ఘోర ప్రమాదంలో బీజేపీ నేత మృతి

గుజరాత్ బీజేపీ నేత, మాజీ మంత్రి వల్లభ్‌భాయ్ వఘాశియా ప్రమాదంలో మృతి చెందారు. కాగా ఆయన బుల్‌డోజర్ ఢీకొని మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే గత రాత్రి ఆయన స్వయంగా కారు నడుపుకుంటూ.. వెళ్తున్న సమయంలో బుల్‌డోజర్‌ను బలంగా ఢీకొట్టారు. దీంతో ఆయన కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో  తీవ్రంగా గాయపడ్డ వల్లభ్‌భాయ్‌ను ఆస్పత్రికి తరలించారు.  కాగా ఆస్పత్రిలో ఆయనని పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్థారించారు. 2012లో సావర్లకుండ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వల్లభ్‌భాయ్ వఘాశియా వ్యవసాయ మంత్రిగా సేవలందించారు. ఆయన మృతితో పలువురు బీజేపీ నేతలు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.