టీటీడీపై చంద్రబాబు,పవన్ దుష్టప్రచారం చేస్తున్నారన్న బీజేపీ నేత
ఏపీలో టీటీడీపై టీడీపీ అధినేత చంద్రబాబు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దుష్టప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. దీనిద్వారా వారు హిందువుల సెంటిమెంట్‌ను గాయపురుస్తున్నారని బీజేపీ నేత విమర్శించారు. వీరిద్దరు ప్రజాక్షేత్రంలో పోరాడలేక అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో కూడా వారు వైవీ సుబ్బారెడ్డి క్రిస్టియన్ అన్నారన్నారు. అది అవాస్తవమని తేలిందన్నారు. అయితే ఇప్పడు శ్రీవాణి ట్రస్టుపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. కాగా ఏపీలో ఎలాంటి మతమార్పిళ్లు లేవని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు.

