‘సభను నడప లేకనే బీజేపీ ఇదంతా చేస్తోంది’..ప్రియాంక గాంధీ
బీజేపీ పార్టీ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై చేస్తున్న ఆరోపణలను కొట్టిపడేసింది ప్రియాంక గాంధీ. సోనియా గాంధీ కో-ఫౌండర్‌గా ఉన్న ఫోరం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఆసియా పసిఫిక్ ఫౌండేషన్‌కు జార్జ్ సోరోస్ నుండి నిధులు అందుతున్నట్లు బీజేపీ ఆరోపించింది. ఈ విషయంపై ప్రియాంక స్పందించారు. ఇది అత్యంత హాస్పాస్పదమని వ్యాఖ్యానించారు. 1994లో ఈ వ్యవహారం జరిగినట్లు చెప్తున్నారని, దానిపై ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా నడపాలన్న ఉద్దేశం లేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు.

