మమతకు బీజేపీ మరో ఝలక్
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి బీజేపీ మరో షాక్ ఇచ్చింది. నందిగ్రామ్‌లోని భెకూటియా సమాబే కృషి సమితి కో-ఆపరేటివ్ పాలక వర్గ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఆ సంఘానికి 12 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 11 మంది బీజేపీ వాళ్లే విజయం సాధించారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఒక్క అభ్యర్థే గెలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఏకంగా సీఎం మమతా బెనర్జీని ఓడించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నందిగ్రామ్‌లో జరిగే ప్రతి ఎన్నికను ఇటు బీజేపీ, అటు టీఎంసీ ఛాలెంజ్‌గా తీసుకున్నాయి. అక్కడ మమతకు మరోసారి ఆశాభంగం కలగడంతో కమలనాథులు సంబరాలు చేసుకుంటున్నారు. నందిగ్రామ్ ఇప్పుడే కాదు.. ఎప్పుడైనా సువేందు అడ్డాయే అని బీజేపీ నేతలు అంటున్నారు.