రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచం..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ పార్టీ రక్షణ కవచంలా మారిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ పార్టీని ఖతం చేయడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మకైయ్యాయిని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరంలో భాగమైన ఒక బ్యారేజ్‌లో ఒక పిల్లర్‌కి పర్రె పడితే మేధావులు, మీడియా అంతా కాళేశ్వరం కూలిపోయింది, లక్ష కోట్లు నష్టమని ఎగబడి ఎగబడి అన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిపోతే, ఖమ్మంలో పెద్ద వాగు బ్రిడ్జి కూలిపోతే, SLBC టన్నెల్ కూలిపోతే మేధావులు, మీడియా ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే బీజేపీ వాడు కుయ్యుమంటలేడు.. కాంగ్రెస్ వాడు కయ్యుమంటలేడని ఎద్దేవా చేశారు.