కూటమి మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదా?
టీడీపీ మేనిఫెస్టో ప్రకటించిన దగ్గర్నుంచి సంచలనంగా మారుతోంది. ఈ మేనిఫెస్టోతో బీజేపీకి ఏం సంబంధం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడం, అదే సమయంలో బీజేపీ ఏపీ వ్యవహారాల కో ఇన్‌చార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్ మేనిఫెస్టో ఆవిష్కరణ సమయంలోనూ అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడంతో అసలు మొత్తం వ్యవహారంలో ఏదో జరుగుతుందన్న భావన కలుగుతోంది. కూటమి మేనిఫెస్టోలో ఎక్కడా కూడా బీజేపీ నాయకుల ఫోటోలు కూడా లేవు. బీజేపీ జాతీయ పార్టీ కావడం వల్ల స్థానిక మేనిఫెస్టోలుండవని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం. ఐతే కూటమి మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.



