Home Page SliderNational

“మా ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్లు ఇస్తామని ఆశ చూపింది”..సీఎం సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు ఇస్తామని ఆశ చూపిందని ఆరోపించారు. తమ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ ఈ విషయం తనకు తెలియజెప్పారని పేర్కొన్నారు.  ఆపరేషన్ లోటస్ ద్వారా బీజేపీ అధికారాన్ని సాధించాలని కుట్ర పన్నుతోందని, బ్యాక్ డోర్ ఎంట్రీ ద్వారా అధికారం కోసం ప్రాకులాడుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిందని, బీజేపీ 2008లోనూ, 2019లోనూ అధికారంలోకి అడ్డదారిలోనే వచ్చిందన్నారు. తమ కాంగ్రెస్‌పార్టీకి 136 ఎమ్మెల్యేలున్నారని, తమ ఎమ్మెల్యేలను డబ్బుతో లొంగదీసుకోవడం అంత సులువు కాదన్నారు. వారు డబ్బుకు లొంగేవారు కాదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలను ఖచ్చితంగా అమలుచేస్తోందన్నారు.