Home Page SliderTelangana

మోదీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ సర్కారు – హోం మంత్రి అమిత్ షా

కేసీఆర్‌ సర్కారు వైఖరి కారణంగా గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. గిరిజన వర్సిటీకి కేసీఆర్‌ సర్కారు జాగా చూపించలేదని.. అందుకే ఆలస్యమైందన్నారు. మోదీ ప్రభుత్వం చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిందని. కృష్ణా ట్రైబ్యునల్‌ నిబంధనలు మార్చి తెలంగాణకు నీటి ఇబ్బంది లేకుండా చేసిందన్నారు. పదేళ్లుగా కేసీఆర్‌ తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదని. కేసీఆర్‌.. రైతులు, దళితులు, గిరిజనులను పట్టించుకోలేదన్నారు అమిత్ షా. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడం గురించే కేసీఆర్‌ ఆలోచించారని… ప్రజలకు సేవ చేద్దామని ఎంత మాత్రం ఆలోచించలేదన్నారు. పవిత్ర భూమి అయినటువంటి ఆదిలాబాద్‌కు వచ్చాను. కుమురం భీం పేరు చెబితేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయన్నారు అమిత్ షా… కుమురం భీంను స్మరించుకుంటూ ఈటల ప్రసంగం ప్రారంభించారు. రజాకార్లపై పోరాడిన వీరభూమికి నమస్కారం చేస్తున్నానంటూ అమిత్ షా స్పీచ్ ప్రారంభించారు. తెలంగాణలో బీజేపీ రాజ్యం తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వస్తోందన్నారు. డిసెంబర్‌3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలని… మోదీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

కేసీఆర్‌ గిరిజనుల కోసం ఎన్నో హామీలు ఇచ్చారు..కానీ అమలు చేయలేదన్నారు అమిత్ షా. ఆదివాసీలకు కేసీఆర్‌ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు…ఇచ్చారా అని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిరం కట్టాలా.. వద్దా.. చెప్పండి? అడ్డంకులను అధిగమించి మోదీ సర్కారు రామమందిరం నిర్మిస్తోందన్నారు. మోదీ సర్కారు ఆర్టికల్ 370 ఎత్తివేసి కశ్మీర్‌కు విముక్తి కల్పించిందన్నారు. మోదీ సర్కారు సర్జికల్‌ స్ట్రయిక్స్ నిర్వహించి శత్రువులను తరిమి కొట్టిందన్నారు. ప్రతి పేద మహిళకు మోదీ వంటగ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చారని… రైతుల ఖాతాల్లో ఏటా రూ.6వేలు జమ చేస్తున్నారన్నారు. దళితులు, గిరిజనుల కోసం మోదీ 9 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారన్నారు. కేసీఆర్ మాత్రం పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారని అమిత్ షా దుయ్యబట్టారు. ఒడిశాలో పుట్టిన నిరుపేద గిరిజన మహిళను నరేంద్ర మోదీ గారు రాష్ట్రపతిని చేశారని… ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌ వాళ్లు కొత్త బట్టలు వేసుకుని వస్తున్నారని విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్‌ పేదల గురించి మాట్లాడుతుంది కానీ…పేదల కోసం ఏం చేయదన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల కోసం చేసిందేమీ లేదని… 9ఏళ్లుగా నరేంద్ర మోదీ సర్కారుపై ఎలాంటి అవినీతి ఆరోపణలూ రాలేదన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌ చేశానని కేసీఆర్‌ చెబుతుంటారు. రైతుల ఆత్మహత్యల విషయంలో కేసీఆర్‌ తెలంగాణను నెంబర్‌వన్‌ చేశారని ఎద్దేవా చేశారు. అవినీతి విషయంలో కేసీఆర్ తెలంగాణను నెంబర్‌వన్‌ చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ ఎన్నికల గుర్తు కారు.. కానీ ఆ కారు స్టీరింగ్‌ మాత్రం ఒవైసీ దగ్గర ఉందన్నారు. ఎంఐఎం దగ్గర స్టీరింగ్‌ ఉన్న భారాస సర్కారు అవసరమా? అని ప్రశ్నించారు. చంద్రశేఖర్‌రావూజీ.. దళితులకు మూడెకరాల భూమి హామీ ఏమైందని షా ప్రశ్నించారు. కొందరికి మాత్రమే ఇచ్చి దళితబంధు గురించి గొప్పలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఆధునిక రజాకార్‌ల నుంచి తెలంగాణను బీజేపీ మాత్రమే కాపాడుతుందన్నారు. మోదీ సర్కారు ఉచితంగా టీకాలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కరోనా నుంచి కాపాడిందన్నారు. జీ-20 నిర్వహించడం వల్ల ప్రపంచ దేశాలు భారత్‌ను ప్రశంసించాయన్నారు.

రాంజీ గోండు, కొమరం భీమ్ పోరాటాలతో స్ఫూర్తి పొందిన గడ్డ ఈ ఆదిలాబాద్ గడ్డ.. గిరిజన బిడ్డలుగా వారి వారసులుగా ఆదిలాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరావేద్దామన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాభోతున్న వేళ ఫామ్ హౌస్ లో ఉన్న కెసిఆర్ కుటుంబానికి, దారుస్సలామ్ లో ఉన్న MIM రజాకార్ల వారసులకు, ఒవైసీ కుటుంబానికి మాన నినాదాలు వినపడాలి అంటూ ప్రజలతో నినాదాలతో హోరేత్తించారు. రజాకార్లను పారద్రోలి త్రివర్ణ పతాకం ఎగురవేసిన రోజున సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవాలను అమిత్ షా గారి ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించుకున్నామన్నారు. నిజాం అభినవ సర్దార్ పటేల్ గా అమిత్ షా గారి నేతృత్వంలో తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా జరుపుకున్నామన్నారు. తెలంగాణ గడ్డపై ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత మొట్టమొదటి సభ ఆదిలాబాద్ వేదికగా జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు.