రూ. 5 కోట్ల డబ్బు బ్యాగుతో బీజేపీ ప్రధాన కార్యదర్శి
మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే వద్ద రూ.5 కోట్ల నగదు బ్యాగ్ దొరకడం కలకలం రేపింది. ఎన్నికలలో డబ్బు పంచుతున్నారనే ఆరోపణతో ఆయనను బహుజన్ వికాస్ అఘాడీ కార్యకర్తలు ఘొరావ్ చేశారు. విరార్ పట్టణంలోని ఒక హోటల్‌లో కార్యకర్తలు, ఓటర్లకు వినోద్ డబ్బు పంచుతూ పట్టుబడ్డారని వారు ఆరోపిస్తున్నారు. ఆ బ్యాగులో ఒక డైరీ కూడా లభ్యమయ్యిందని, దానిలో రూ.15 కోట్ల డబ్బును ఎవరికి పంచాలో వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపడేసింది. ఇవన్నీ నిరాధార ఆరోపణలని, వినోద్ తావ్డే నేషనల్ జనరల్ సెక్రటరీ అని, అతనూ వార్డు లెవెల్లో డబ్బు పంచాడని ఆరోపణ చేయడం హాస్యాస్పదం అని పేర్కొంది. బీజేపీ ఇమేజ్‌ను దెబ్బతీయడానికే ఇలాంటి అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

