Home Page SliderTelangana

ఇటిక్యాలలో గడప గడపకు బీజేపీ అభ్యర్థి ప్రచారం

రాజోలి: అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలంలో గడప గడపకూ బీజేపీ కార్యక్రమాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలంలోని వేముల, ధర్మవరం గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ నెల 30వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని, అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు.