Home Page SliderNational

మధ్యప్రదేశ్ సీఎంను ప్రకటించిన బీజేపీ

దేశంలో తెలంగాణా,మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఛత్తీస్‌ఘడ్,మిజోరాం రాష్ట్రాల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ 5 రాష్ట్రాల్లో  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇప్పటికే వెలువడ్డాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయ పతాకం ఎగురవేసింది. మరోవైపు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ గెలుపొందిన 3 రాష్ట్రాల్లో సీఎం ఎవరు అనేది సందిగ్ధంగా మారింది. అయితే ఈ ఉత్కంఠకు తెర లేపుతూ బీజేపీ నిన్న ఛత్తీస్‌ఘడ్ సీఎం అభ్యర్థిని ఖరారు చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌ను నియమిస్తున్నట్లు  అధిష్టానం వెల్లడించింది. అయితే అందరు శివరాజ్ సింగ్ లేదా జ్యోతిరాధిత్య సింథియాకు పగ్గాలు ఇస్తారని భావించారు. కానీ బీజేపీ అధిష్టానం ఎవరు ఊహించని విధంగా సీఎం రేసులో లేని మోహన్ యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ఖరారు చేసింది. కాగా RSSకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మోహన్ ,ఉజ్జయిని ఎమ్మెల్యేగా ఉన్నారు. 2013లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన మంత్రిగాను పని చేశారు.అయితే బీజేపీ రేపు రాజస్థాన్ సీఎం అభ్యర్థిని కూడా ఖరారు చేయనున్నట్లు సమాచారం.