Home Page SliderNational

నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన బీజేపీ

దేశవ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఇప్పటికే పార్టీలో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగబోయే 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను నియమించినట్లు ప్రకటించింది. కాగా తెలంగాణా రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ప్రకాశ్ జవదేకర్,సహ ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సల్‌ను నియమించింది. మరోవైపు మధ్యప్రదేశ్‌కు భూపేంద్ర యాదవ్,ఛత్తీస్‌గఢ్‌కు ఓం ప్రకాశ్ మాథూర్,రాజస్థాన్‌కు ప్రహ్లాద్ జోషిని ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.