MLC, స్థానిక సంస్థల ఎన్నికలకు కమిటీలను ప్రకటించిన బీజేపీ
TG: ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆందోళన కార్యక్రమాలపై బీజేపీ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో ఎంపీ అరవింద్, పాల్వాయి హరీష్, ఏవీఎన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, జి.నగేష్, ఈటెల రాజేందర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, రాకేష్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ తదితరులకు చోటు లభించింది. రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ పార్టీ ప్రకటించనుంది.


 
							 
							