ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ దీక్షలు
ఢిల్లీలో తెలంగాణ రాజకీయం హీటెక్కుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎమ్మెల్సీ కవిత దీక్షకు దిగారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై నిరసనగా బీజేపీ దీక్షకు దిగింది. దశాబ్దాల తరబడి మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయడం లేదని.. బీజేపీ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలంటూ కవిత ఆందోళనకు దిగారు. ఈ దీక్షకు 18 పార్టీల మద్దతు లభించిందని ఆమె చెప్పారు. ఇక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ పై బీజేపీ ఢిల్లీలోనే బీజేపీ దీక్షకు దిగింది. మొత్తంగా రెండు పార్టీలు హోరాహోరీ దీక్షలతో రక్తికట్టిస్తున్నాయి.
