Home Page SliderTelangana

తెలంగాణలో బీజేపీకి పుట్టినిల్లు కూకట్‌పల్లి-ఈటల రాజేందర్

కూకట్ పల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. కూకట్‌పల్లిలో చెదరని కార్యకర్తలు బీజేపీకి ఉన్నారన్నారు. మల్కాజిగిరిలో నిన్న జరిగిన నరేంద్రమోదీ గారి ర్యాలీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్‌లో మోదీ ప్రభంజనానికి నిదర్శనం. ఈ దఫా మోదీ ప్రధాని కావాలని ప్రజలు కృతనిచ్చయంతో ఉన్నారు. తెలంగాణలో 12 పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నాము, ఇంకా కష్టపడితే మిగతావి కూడా గెలవగలమనే భావన వ్యక్తం అమిత్ షా వ్యక్తం చేశారో.. నిన్నటి ర్యాలీలో అది ప్రస్ఫుటం అయ్యిందన్నారు ఈటల రాజేందర్.

కుటుంబ సభ్యులతో చిన్న పిల్లలతో పాటు ప్రజలు నిన్న హాజరై వారు చూపిన స్పందన మోదీ పట్ల ఉన్న ప్రేమ, విశ్వాసం, అభిమానానికి నిదర్శనమన్నారు. తెలంగాణ గడ్డ మీద మొదటి ఎన్నికల శంఖారావం మల్కాజ్ గిరి గడ్డ మీదనే మొదలైంది. ఇక్కడ ఎగిరే జండా కాషాయ జెండా. గెలిచేది బీజేపీ. 7 స్థానాల్లో BRS గెలిచినా ప్రజలు వారి ఊసే ఎత్తడం లేదు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.. ఓటు వేయడం ఎందుకు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వందలకొట్లు ఖర్చు పెట్టే నాయకుడి కోసం వెతుకుతున్నారు. ఎన్నిచేసిన కాంగ్రెస్ చెల్లుబాటు కాదు. BRS ను ఆదరించే పరిస్థితి లేదన్నారు ఈటల.

కార్యకర్తలకు నా విజ్ఞప్తి ఒక్కటే.. మన మీద ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో ఓట్ల రూపంలో మలచుకోవడంలో నిమగ్నం కావాలి. బేదభావాలు లేకుండా, వైషమ్యాలు లేకుండా కలిసిమెలిసి పార్టీని గెలిపించాలని సంకల్పంతో పనిచేయాలి. 36 లక్షల ఓటర్లను నేను కలిసే అవకాశం ఉండే అవకాశం లేదు. కార్యకర్తలే కథానాయకులై ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్ రాకుండా పనిచేయాలి అని కోరుతున్నా. మోదీ సహకారంతో మీకు సేవచేసే అవకాశం కల్పించాలని కోరుతున్నానని ఈటల రాజేందర్ తెలిపారు.