50 అడుగుల కటౌట్‌తో కోహ్లీకి బర్త్‌డే విషెస్..!
టీమ్ ఇండియా స్టార్ బ్యాట్సెమెన్, మేటి క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయ్. విరాట్ కోహ్లీని ఆయన అభిమానులు కింగ్ కోహ్లీ అంటూ పిలుచుకొని సరదాపడుతుంటారు. విరాట్ కోహ్లీ 34వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు దేశ వ్యాప్తంగా పండుగ చేసుకున్నారు. కాదు కాదు ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక సుదర్శన్ 35 MM థియేటర్ వద్ద 50 అడుగులు కోహ్లీ కటౌట్ తో ఆయనకు పూజలు నిర్వహించారు అభిమానులు. గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయిన కోహ్లీ ఇప్పుడు పుంజుకొని సత్తా చాటుతూ ప్రపంచ వ్యాప్తంగా క్రీడా అభిమానులను సంతోషపెడుతున్నాడు. తాజాగా టీ 20 మ్యాచ్‌లలో కోహ్లీ అత్యధిక రికార్డులను బద్ధలుకొట్టాడు.
