Home Page SlidermoviesNationalTrending TodayVideos

రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు బర్తడే ట్రీట్..మాస్ లుక్‌లో గ్లోబల్ స్టార్..

దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. జగపతి బాబు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు ఈ చిత్రంలో నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ ఫస్ట్ లుక్‌ని మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ఫ్యాన్స్‌ను నిరాశ పరచడంతో ఈ సారి హిట్ కొడతామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.