Andhra PradeshHome Page Slider

మేకపోతుకు జన్మదిన వేడుకలు

అనంతపురం జిల్లాలో వింత ఘటన జరిగింది. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో చాకలి వెంకటేశులు, పద్మావతి దంపతులు పెంచుకుంటున్న మేకపోతుకు మూడో జన్మదిన వేడుకలు జరిపారు. మేకపోతుకు తన తండ్రి సుంకన్న పేరు పెట్టారు. ఈ వేడుకకు ఫ్లెక్సీలు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సుమారు 50 మందికి భోజన ఏర్పాట్లు చేశారు. వేడుకల నిమిత్తం మొత్తం రూ.12,000 వరకు ఖర్చు చేసినట్లు కుటుంబం తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.