వ్యక్తికి బర్డ్ ఫ్లూ అంతా ఉత్తిదే..
ఇప్పటి వరకు ఇండియాలో మనుషులకు బర్డ్ ఫ్లూ సోకినట్టు ఆధారాలు లేవని ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు బాదంపూడిలో ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూ అంటూ వచ్చిన వార్తపై ఆమె స్పందించారు. సరైన అధికారిక ప్రకటన లేకుండా బర్డ్ ఫ్లూ గా నిర్ధారణ ఎలా చేస్తారన్నారు. ఇలాంటి సమయాల్లో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ హితవు పలికారు. బర్డ్ ఫ్లూ విషయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని, నియంత్రణలో అందరూ సహకరించాలని కోరారు.

