తిరుమల శ్రీవాణి ట్రస్ట్‌కు బిల్లేది -చంద్రబాబు
కలియుగదైవం వేంకటేశ్వరుని దేవస్థానంలో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయన్నారు చంద్రబాబు నాయుడు. శ్రీవాణి టికెట్లకు రసీదులు ఇవ్వట్లేదంటున్నారు. ఆ డబ్బులు ఏమవుతున్నాయని, ఎవరి ఖాతాలోకి వెళుతున్నాయన్నారు. తిరుమల వెంకన్న స్వామికి అపచారం చేస్తే పుట్టగతులుండవన్నారు. దేవుడు ఆయన పవిత్రతను కాపాడుకుంటారని, అపచారం చేసిన వారు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు చంద్రబాబు. దేవుని డబ్బును అనుభవించే హక్కు ఎవరిచ్చారని, అసలు శ్రీవాణి ట్రస్ట్‌ను ఎవరు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు చంద్రబాబు.

