పారిస్ ఒలింపిక్స్‌లో గుర్రపు స్వారీలో బిల్‌గేట్స్ అల్లుడు
పారిస్ ఒలింపిక్స్‌లో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ అల్లుడు నాయెల్ నాజర్ కూడా పాల్గొంటున్నారు. గుర్రపు స్వారీలో ఈజిప్టు తరపున ఆయన ఈక్వెస్ట్రియన్ పోటీలో తలపడుతున్నారు. నాజర్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం కొత్తేం కాదు. ఇప్పటికే ఆయన రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఆయన 2021లో బిల్ గేట్స్ పెద్ద కుమార్తె జెన్నిఫర్‌ను నాజర్ వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల ప్రాయం నుండే ఆయన గుర్రపు స్వారీని అభ్యసించడం విశేషం.