Home Page SliderNational

సెలబ్రెటీలకు లిఫ్టు ఇచ్చి ఇరుక్కుపోయిన బైకర్స్

మంచికి పోతే చెడు ఎదురుకావడమంటే ఇదే అనేమాట ఈ బైకర్ల విషయంలో నిజం అవుతోంది. అనుష్కశర్మ, అమితాబ్ బచ్చన్‌లకు లిఫ్టు ఇచ్చి పాపులర్ అయ్యామన్న సంతోషం ఇంకా పూర్తిగా పొందనేలేదు. ఇంతలోనే వారి సంతోషం ఆవిరయ్యింది. వారికి హెల్మెట్ ధరించలేదని జరిమానా పడింది. మొన్నటికి మొన్న అమితాబ్ బచ్చన్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో కారు వదిలి, బైక్‌లో లిఫ్ట్ అడిగి వెళ్లారు. అతనికి థ్యాంక్స్ చెపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అలాగే అనుష్క కూడా కారులో వెళ్లుతుంటే, దారిలో చెట్టు పడిపోవడం వల్ల ఒక వ్యక్తి బైక్ మీద స్టూడియోకు చేరుకున్నారు. దీనితో వీరి ఫొటోలు వైరల్ అయ్యాయి.

అయితే కొందరు వీరు హెల్మెట్లు ధరించలేదంటూ ముంబయి పోలీసులకు పోస్టులు పెట్టారు. దీనిపై వారు స్పందించి, ఈ బైకర్లకు చలాన్లు వేశారు. అనుష్కకు లిఫ్టిచ్చిన వ్యక్తికి 10,500 రూపాయలు జరిమానా కాగా, అమితాబ్‌ను తీసుకెళ్లిన వ్యక్తికి ఎంత చలాన్ పడిందో తెలియలేదు. ఈ చలాన్లను ట్విటర్‌లో షేర్ చేశారు ముంబయి ట్రాఫిక్ విభాగం.