ముస్లింలకు బీజేపీ రంజాన్ తోఫా
బీజేపీ ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనుంది. రంజాన్ వేళ BJP మైనారిటీ మోర్చా ‘సౌగాత్ ఈ మోదీ’ పేరిట ప్రత్యేక క్యాంపెయిన్ ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింలకు పండుగ కిట్లు పంపిణీ చేయనున్నారు. BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ఢిల్లీలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని రేపు అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ కిట్లలో పురుషులు, మహిళల కోసం కొత్త వస్త్రాలు, సేమియా, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ తదితర పండుగకు అవసరమైన సరుకులు ఉంటాయి. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే సందేశాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా దీన్ని నిర్వహించనున్నట్లు జమాల్ సిద్దిఖీ చెప్పారు. దేశంలో సోదరభావం విలసిల్లేలా, అన్ని మతాలకు అతీతంగా, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలనేదే తమ అభిమతమని జమాల్ సిద్దిఖీ అన్నారు.