Home Page SliderNationalNewsPolitics

అమిత్ షా ఊహించినదానికంటే పెద్ద విజయం

గుజరాత్‌లో, అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 2017 రాష్ట్ర ఎన్నికలలో 99 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 49.1 ఓట్ షేర్‌ సాధించగా… తాజా అది 52.5 శాతానికి చేరుకుంది. కాంగ్రెస్ 27.31 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది. గత ఎన్నికల్లో 41.4 శాతం ఓట్లను పొందిన కాంగ్రెస్ ఇప్పుడు భారీగా ఓట్లను కోల్పోయింది. నాడు కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోగా… నేడు కేవలం 16 సీట్లను మాత్రమే గెలుచుకునేలా ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 26 పార్లమెంటరీ నియోజకవర్గాలను 62.21 శాతం ఓట్లతో బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 32.11 శాతం ఓట్లను పొందగలిగింది.

2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు దాదాపు 13 శాతం ఓట్లను సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించినా… నాలుగు సీట్లకే పరిమితమయ్యేలా సీన్ కన్పిస్తోంది. ఆప్ కేవలం రెండు సీట్లు గెలుచుకుని 6 శాతానికి పైగా ఓట్లను కలిగి ఉంటే అది జాతీయ పార్టీ అర్హత సాధిస్తుంది. కేవలం 24,918 ఓట్లతో ఆప్ గత ఎన్నికల్లో 0.1 శాతం ఓట్లను ఆప్ సాధించింది. ఐతే ఇప్పుడు ఆప్ భారీగా ఓట్లను పొందగలిగింది. సుమారుగా 40 లక్షల ఓట్లను రాబట్టగలిగింది.

Gujarat Election results

కేంద్ర హోం మంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత అమిత్ షా 2022 అసెంబ్లీ ఎన్నికలలో 140 సీట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా… ఆ పార్టీ ఆ స్థాయిని సునాయాసంగా దాటుతోంది. 1985 నాటి కాంగ్రెస్ రికార్డును అధిగమించి, ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో ఆల్ టైమ్ బెస్ట్ పనితీరును రికార్డు చేసింది. పలు ఎగ్జిట్ పోల్‌లు ఆప్ 15 మార్కును దాటదని అంచనా వేసినప్పటికీ, ఆ పార్టీ కేవలం నాలుగు స్థానాలకే పరిమితం అవుతోంది. గుజరాత్‌లో 15-20 శాతం ఓట్లు గెలవడం పెద్ద విజయం కొద్ది రోజుల క్రితం కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్‌లో కొత్త బీజేపీ ప్రభుత్వం డిసెంబర్ 11 లేదా 12 తేదీల్లో ప్రమాణస్వీకారం చేయనుంది. 182 మంది సభ్యులున్న అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికలు జరిగాయి.