Home Page SliderNational

బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు వచ్చిన మొత్తం బహుమతులెన్నంటే…

నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షోకి ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలుసు. ఈ షోలో విజేతలు ప్రైజ్ మనీతో పాటు ఎన్నో విలువైన బహుమతులు కూడా గెలుచుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ -7 విజేత రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కు వచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్టులు ఎన్నో తెలిస్తే ఆశ్చర్యపోతారు. టాప్ -6 ఫైనలిస్టులలో టైటిల్ చివరికి రైతు బిడ్డ ప్రశాంత్‌ను వరించింది. ప్రైజ్ మనీ 35 లక్షలన్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో పాటు వితారా బ్రెజా కారు, రూ.15 లక్షల విలువైన డైమండ్ జ్యూయలరీని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా  తనకు ఓటు వేసినవారందరికీ కృతజ్ఞతలు చెప్పారు ప్రశాంత్. సామాన్యుడైన తనను సెలబ్రెటీల మధ్య గెలిపించిన ప్రజలకు ఎంతో రుణపడి ఉంటానన్నారు. తాను గెలుచుకున్న డబ్బును రైతులకే పంచుతానని పేర్కొన్నారు.