Andhra PradeshHome Page Slider

కర్నూలు జిల్లాలో బండరాయి భయం

కర్నూలు జిల్లాలో గోనెగండ్లలోని ఓ పెద్ద కొండలాంటి  బండరాయి  విపరీతమైన ఎండలకు పగులు వారింది. ఇది ఏ క్షణంలో తమ నివాసస్థలాల్లోకి దూసుకువస్తుందోనని బెంగపడుతున్నారు అక్కడి ప్రజలు. ఈ బండరాయి సుమారు 500 సంవత్సరాల క్రిందటిదని, దాని బరువు సుమారు ఆరువేల టన్నులు ఉంటుందని అంచనాలు వేస్తున్నారు అధికారులు. దీని వెడల్పు సుమారు 50 అడుగుల పైనే ఉంది. ఈ కొండరాయికి దగ్గరలో 20 అడుగుల దూరంలో ఇళ్లున్నాయి. దీనితో అక్కడి ప్రజలు  భయాందోళలకు గురవుతున్నారు. ఈ ప్రదేశానికి ఎన్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ టీమ్, పోలీసులు చేరుకుని చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. వారిని దగ్గరలోని స్కూలులో ఉంచారు. ఈ ప్రదేశాన్ని డేంజర్ జోన్‌గా ప్రకటించారు. దీనిని ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. దాని చుట్టూ కంచెవేసి రక్షణ ఏర్పాటు చేశారు. ఇది ఎండవలన, సంకోచవ్యాకోచాల వల్ల పగిలి ఉండొచ్చని, దానిని పగుళ్ల మధ్య సిమెంట్ వేసి, ప్లాస్టరింగ్ చేస్తామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.