Home Page SliderNational

రూ.1000 కోట్లతో తెరకెక్కనున్న రణబీర్‌కపూర్ రామాయణంలో బిగ్ స్టార్స్

రూ.1000 కోట్లతో తెరకెక్కనున్న రణబీర్‌కపూర్, సాయిపల్లవిల  రామాయణంలో ఊహించని  బిగ్ స్టార్స్ కూడా పాలుపంచుకోబోతున్నారని సమాచారం. రణబీర్ కపూర్ రాముడైతే, సాయిపల్లవి సీతగా, కేజీఎఫ్ స్టార్ యశ్ రావణుడిగా కనిపించబోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ చిత్రంపై మరిన్ని అప్‌డేట్స్ లీకయ్యాయి. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ గెస్ట్‌రోల్‌లో కనిపిస్తారని, సౌతిండియా హీరో కార్తి లక్ష్మణునిగా నటిస్తున్నారని సమాచారం. పైగా హనుమంతునిగా రణవీర్ సింగ్ కనిపిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలన్నీ విమానంలో తన పక్కన కూర్చున్న ఫ్యాన్‌తో స్వయంగా రణబీర్ కపూరే నోరు జారాడట. రెండువేల కోట్లు వసూలు చేసిన అమీర్ ఖాన్ చిత్రం దంగల్ సినిమా డైరక్టర్ నితిష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని అందరికీ తెలిసిందే.