తెలంగాణ ప్రభుత్వానికి భారీ షాక్..
తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై అనుకూలంగా స్టే ఇచ్చింది. లగచర్ల, హకీంపేటలో భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌పై స్టే విధించి, తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. అక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. అక్కడ భూ సేకరణ విషయంలై ఇటీవల పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ప్రభుత్వం ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా భూములు సేకరిస్తోందంటూ విపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి.

