Andhra PradeshHome Page Slider

వైసీపీకి బిగ్ షాక్..

వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంగళగిరిలోని  వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసుల నుండి నోటీసులు వచ్చాయి. 2021లో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి విషయంలో వైసీపీ కార్యాలయం నుండి ఎవరైనా బయలుదేరారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనికోసం 2021లో అక్టోబర్ 19న దాడి జరిగిన రోజు సీసీ టీవీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసులు ఇచ్చారు. ఈ ఘటనలో వైసీపీ నేత దేవినేని అవినాశ్‌కు కూడా పోలీసులు నోటీసులిచ్చారు.