వైసీపీకి బిగ్ షాక్
వైసీపీకీ గట్టి షాక్ తగిలింది. కాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఆ పార్టీకి తాజాగా రాజీనామా చేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు లేదన్నారు. కాగా వైసీపీ పార్టీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను అన్నారు. అయితే తనతోపాటు మొత్తం 50మంది వైసీపీకి రాజీనామా చేస్తున్నారని కిలారి రోశయ్య తెలిపారు. ఈ నేపథ్యంలో తామంతా ఏ పార్టీలో చేరతామో త్వరలోనే వెల్లడిస్తామన్నారు.